సర్ మీ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ ఇలాంటి ఆపరేషన్స్ మన ఇండియా లో ఇదే మొదటిగా చెయ్యడం సక్సెస్ అవ్వడం. మీరు సూపర్ సర్ మీరు ఏదైనా చెయ్యగలరు
మీరు హండ్రెడ్ పర్సెంట్ పెర్ఫెక్ట్ అని బయట మీ కోసం మీడియా వాళ్ళు వెయిటింగ్ సర్ అని నర్స్ వచ్చి చాలా సంతోషంగా చెప్పి బయటకి వెళ్ళిపోయింది.
తను అలా వెళ్లిన తరవాత యష్ చేతికి ఉన్న వాచ్ తీసి టేబుల్ పైన పెట్టీ చైర్ లో జరబడి వెనక్కి కూర్చుని చేతులు కట్టుకొని అందరికీ పైకి కనిపించే మెరుపులు చూసి నా జీవితం పెర్ఫెక్ట్ అనుకుంటున్నారు.
కానీ నాకే తెలుసు ఇది నా జీవితం కాదు అని ఎవరో జీవితాన్ని నేను జీవిస్తున్నాట్టు అనిపిస్తూంది అన్ని ఉన్న ఏదో వెలితి ఈ జీవితానికి తనలో తాను చెప్పుకుంటూ ఉండగా.
ఒక అమ్మాయి లోపలికి దుసుకుంటు వచ్చి కూర్చుని ఉన్న యష్ ను గట్టిగా హగ్ చేసుకొని ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు బయట అందరూ మన కోసం వెయిటింగ్ అదే మీ కోసం త్వరగా రండి అంది.
యష్ వెంటనే పైకి లేచి
ఇది హాస్పిటల్ ఇషిత అన్నాడు.
ఇషిత :
మన హాస్పిటల్ మనకి భయం ఎంటి అండి.
లేట్ చెయ్యకుండా త్వరగా కిందకి రండి అని చెప్పి బయటకి వెళ్ళిపోయింది.
కోట్ సరి చేసుకొని నిదానంగా బయటకి వెళ్ళాడు యష్.
అతను అలా బయటకి రాగానే మీడియా వాళ్ళు దూసుకు వచ్చారు అతని దగ్గరకి.
సర్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఎక్స్పిక్ట్ చేశారా ఇది అంతా సాధ్యం అని.
మీ విజయం వెనక ఎవరు ఉన్నారు మీ మామ గారా లేక మీ భర్యనా అని అడిగారు.
యష్ నవ్వుతూ
ఎవరైనా ఆపరేషన్ అనుమానంగా చేస్తే సక్సెస్ అవ్వకపోవచ్చు.
భయంతో చేస్తే చేసేది కూడా చెయ్యలేము.
ప్రాణాలు కాపాడాలని చేస్తే సక్సెస్ రెట్ తొంబై శాతం కాపాడవచ్చు కానీ ఏ డాక్టర్ అయినా పట్టు పట్టి చేస్తే అది సక్సెస్ అయి తీరుతుంది నేను దానినే నమ్ముతాను.
చెయ్యగలను అనుకుంటేనే నేను ఆ పనిని మొదలు పెడతాను లేదంటే మొదలు కాదు కదా దాని గురించి కూడా ఆలోచించను అని చెప్పి మీ టైమ్ తీసుకొని ఇక్కడికి వచ్చి నన్ను ప్రశ్నలు అడిగినందుకు చాలా థాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
సర్ ఇంకా క్వశ్చన్స్ అడగాలి అంటున్న వినకుండా తన కార్ తీసుకొని ఇంటికి బయలుదేరాడు.
కొద్ది సేపటికి
ఇంటికి వెళ్ళి బాత్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని తన మంచం మీద కూర్చున్నాడు.
ఇషిత చాలా కోపంగా లోపలికి వస్తుంది.
వచ్చి రాగానే డోర్ గెంటుకుంటు లోపలికి వెళ్ళింది.
" నువ్వు చేసింది ఏం అయినా బాగుందా యష్ " అని అరుస్తుంది.
యష్ :
నోరు కాస్త తగ్గించి మాట్లాడు అన్నాడు.
ఇషిత :
ఇప్పటికే చాలా విషయాల్లో నా నోరు తగ్గే ఉంటుంది.
నీ వెనక ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు పోనీలే నా పేరు ఎలాగో చెప్పడం ఇష్టం లేదు కనీసం మా డాడీ పేరు అయినా చెప్పొచ్చు కదా.
ఆయన నాకు హెల్ప్ చేశారు అని , మంచి వారు అని ఎక్కడ కూడా నా తల ఎత్తుకొకుండా చేస్తావు నువ్వు అని అరుస్తుంటే.
యష్ చిన్నగా నవ్వి ఇప్పుడు ఏం చేస్తావు మీ హాస్పిటల్ నుంచి నన్ను తిసేస్తారా లేక ఏం చేస్తారు చెప్పు నస పెట్టకు కాస్త నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
యష్ యష్ అని అరుస్తూ వెనకనే వెళ్తుంటే యష్ మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
నేరుగా గెస్ట్ హౌస్ కి వెళ్లి ఫుల్ గా ఏసి ఆన్ చేసుకొని
ఆలోచనల్లోకి వెళ్ళాడు.
...***********...
అవి నేను ఇంటర్ చదువుతున్న రోజులు
మాది ఒక చిన్న మధ్య తరగతి కుటుంబం
అమ్మ నేను ( యష్ ) నాన్న అంతే.
చదువుకి ఇచ్చినంత ప్రాధాన్యత నేను ఇంక దేనికి ఇచ్చేవాడ్ని కాదు.
నా కళ్ళ ముందే మా తాతగారు గుండే పోటుతో మరణించడంతో అప్పుడే ఫిక్స్ అయ్యాను ఎంత కష్టమైన గుండే డాక్టర్ అవ్వాలి అని.
ఆ పంతం మీదనే ఇంటర్ లో బైపిసి తీసుకున్నాను.
రాత్రి పగలు తేడా లేకుండా నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యాను కోసం.
పరీక్ష తేదీ రానే వచ్చింది.
ఎంతో పట్టుదలతో ఎగ్జామ్ రాసి వచ్చాను.
అమ్మ నాన్న నా చదువు కోసం చాలా కష్టపడే వారు.
నాన్న కూలి పనికి వెళ్తే అమ్మ వేరొక ఇంట్లో పని చేసి కష్టపడి డబ్బు సంపాదించి నా చదువు కోసం ఇచ్చేవారు.
ఇది ఇలా ఉండగా రిజల్ట్స్ రోజు వచ్చింది.
నాకు మొదటి రాంక్ రావాలి అని ఏం ఆశ లేదు ఎంబీబీఎస్ సీట్ వస్తె చాలు అనే పంతం మాత్రం గట్టిగా ఉంది.
భయం భయంగా రిజల్ట్స్ చూసుకున్నాను.
ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చింది నాకు.
మొదటి ర్యాంక్ ఎవరికి వచ్చింది అని అనుకుంటూ ఉండగా మా వీధి చివర ఒక అనాధా ఆశ్రమంలో నేత్ర అనే అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంట.
ఒక్క దెబ్బకి ఆ అనాథ శరణాలయం ఎక్కడికో వెళ్లిపోయింది.
తన పేరు ఇండియా మొత్తం మారు మోగిపోయింది.
మీడియా వాళ్ళు పేపర్ వాళ్ళు తన కోసం లైన్ కట్టారు.
ఇండియా లో టాప్ యూనివర్సిటీ లో తనకి సీట్ సిద్దం అయిపోయింది.
కొద్దో గొప్పో మనల్ని కూడా పొగుడుతున్నారు కానీ ఇంటి దగ్గర ఉండి చదివి తన ఫస్ట్ రావడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అసలు తను ఎలా ఉంటుందో చూడాలి అని నేను ఆ రోజు సాయంత్రం వాళ్ళ అనాథ ఆశ్రమానికి బయులుదేరాను.
నేను అక్కడికి వెళ్ళేసరికి బయట కొంత మంది పిల్లలు ఆడుకుంటున్నారు.
కాస్త పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు
వాళ్ళలో ఈ నేత్ర ఎవరా అని నా కళ్ళు వెతుకుతూ ఉండగా ఒక పెద్ద ఆవిడ వచ్చి అమ్మ నేత్ర ఒక్కసారి లోపలికి రా అని పిలిచింది.
ఒక అమ్మాయి వస్తున్నాను అమ్మ ఐదు నిముషాలు అని బ్యాట్ అక్కడ పెట్టీ లోపలికి బయలుదేరింది.
పేరుకు తగ్గట్టుగానే ఆ అమ్మయి కళ్ళు చాలా అందంగా ఉన్నాయి మనిషి చక్కగా ఉంది చాలా బాగుంది అనుకొని నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను.
తన అందానికి నిజంగానే ముద్దుడని అయ్యాను నేను.
ఇంటికి వెళ్ళిన తరవాత ఒక వార్త వచ్చింది.
ఆల్ ఇండియా ర్యాంకులలో మొదటి ముగ్గురుతో రేపు ఒక మీటింగ్ ఉంది అని సీఎం గారితో అని.
మాకు కోట్ కూడా పంపించారు.
మన రాష్ట్రంలో నేత్ర కి మొదటి ర్యాంక్ వచ్చింది నాకు రెండో ర్యాంక్ వచ్చింది మూడోవ ర్యాంక్ బయట రాష్ట్రం
అబ్బాయికి వచ్చింది.
మా ఇద్దరినీ ప్రశంసించడానికి చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు అని చెప్పారు.
నాకు కాస్త భయంగా కంగారుగా అలాగే చాలా ఆనందంగా అనిపించింది సీఎం గారితో మీటింగ్ అనేసరికి.
అది నేత్ర తో కలిసి అంటే అమ్మో అని తెగ ఆనందించాను.
అంతా సిద్దం అవుతున్నాయి.
పువ్వులు టెంట్లు అన్ని సిద్దం చేస్తున్నారు.
సీఎం వాళ్ళ ఊరికి ఎప్పుడు రాలేదు సీఎం ఎంటి కనీసం ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడూ వచ్చేవారు కాదు అలాంటిది వాళ్ళకి మొదటి రెండు ర్యాంక్లు రావడంతో అందరూ వచ్చి హడావిడి చేస్తున్నారు.
మొదటి పది మంది కి ఇండియా లోని ఢిల్లీ ఎయిమ్స్ కాలేజ్ లో సీట్ కన్ఫర్మ్ అయింది.
ఆ వార్త మెల్లగా వారి వరకు చేరింది.
ఎప్పుడూ ఆ ఆశ్రమాన్ని కూడా వదలని నేత్ర ఢిల్లీ వెళ్ళడం అంటే చాలా కష్టమైన పనే.
ఆశ్రమంలోని పెద్దలు అందరూ తనని చూసి గర్వపడుతున్నాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
కానీ నేత్ర మనసు మాత్రం భయంతో మునిగిపోయింది.
అక్కడ ఉన్న పెద్ద ఆవిడ ( దుర్గ ) తో నేత్ర ఇలా మాట్లాడుతుంది.
దుర్గమ్మ నాకు మొదటి ర్యాంక్ వచ్చింది అని చాలా సంతోషంగా ఉంది కానీ ఢిల్లీ వెళ్ళడం అంటే నాకు చాలా భయంగా ఉంది అది కాకుండా మిమల్ని అందరినీ వదిలి వెళ్ళాలి అని అసలు లేదు నాకు.
ఇక్కడే దగ్గరలో ఇంకొక యూనివర్సిటీ ఉంది దానిలో కవలితే నేను చదువుకోవచ్చు ఫ్రీ గా అక్కడే చదువుకుంటాను ఏం అంటావు దుర్గమ్మ అని అడిగింది
దుర్గ :
నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేత్ర.
ఇంత గొప్ప ర్యాంక్ రావడం అంటే మాటలా మన ఆశ్రమం నుంచి ఒక అమ్మాయి ఢిల్లీ వెళ్లి చదువుతుంది అంటే ఎంత మంచి పేరు వస్తుంది.
మిగిలిన అమ్మాయిలు కూడా నీలా చదవాలి మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటారు నువ్వు ఇలా భయపడి వెళ్లకపోతే చాలా అవమానంగాను ఇంకా ఎందుకు పనికి రాని వాళ్ళలా మనల్ని పరిగణిస్తారు అలా చెయ్యడం నీకు ఇష్టమా అని అడిగింది.
అలా అడగడంతో ఇంకేం మాట్లాడలేకపోయింది నేత్ర.
దుర్గ :
అంతే కాదు మన సందు చివరిలో ఉండే ఇంట్లో యష్ అనే అబ్బాయికి రెండో ర్యాంక్ వచ్చింది అంటే.
సో తను కూడా నీకు తోడుగా ఉంటాడు.
ఇక భయం వదిలి వెళ్లి ప్రశాంతంగా పడుకో అని చెప్పింది.
యష్ ఎవరు నేను ఒక్కసారి తనతో మాట్లాడాలి అనుకొని అక్కడి నుంచి ఎవరికి తెలియకుండా యష్ వాళ్ళ ఇంటికి బయలుదేరింది.
నేరుగా ఇంటికి వెళ్లి
నా పేరు నేత్ర అండి నేను ఒక్క నిమిషం మీ అబ్బాయి యష్ తో మాట్లాడవచ్చా అని అడిగింది.
**************************
ఈ కథ సూపర్ రైటర్ అవార్డ్స్- 3 కోసం రాస్తున్నది.మీ సహాయం సహకారం నాకు ఉంటాయి అని అనుకుంటున్నాను.ధన్యవాదములు.
Download NovelToon APP on App Store and Google Play